Thursday, April 25, 2024
- Advertisement -

మళ్ళీ వర్షాలు.. ఈసారి ఏం అవుతుందో..!

- Advertisement -

తెలంగాణా లో ఈనెల 18న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్​, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో… రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో.. సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఇవాళ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

కింది స్థాయి, తూర్పు గాలుల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. దక్షిణ కొంకణి నుంచి మధ్య మహారాష్ట్ర మీదుగా విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వేరే దేశం పౌరుడు ఇక్కడ చట్ట సభలో 10 ఏళ్ళ నుంచి ఉంటే..!

మధ్యప్రదేశ్‌లో అదుపుతప్పి కాల్వ‌లో ప‌డిన బ‌స్సు.. 32 మంది మృతి!

మెంతులు తో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి!

రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు.. ఆదేశాలు జారీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -