ఏపీలో రాజకీయాలు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నాయి.పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఇప్పుడు అధినేతకు ఎదురు తిరుగుతన్నారు.తాజాగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్‌బుక్ లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో బ్రాహ్మణకార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును చంద్రబాబు పదవి నుంచి తొలగించారు.
ఆంద్రప్రదేశ్‌కు తొలి సీఎస్‌గా ఆయన పనిచేశారు.ఆయన పదవీ కాలాన్ని రెండు సార్లు పొడిగించారు.రిటైరయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా చంద్రబాబు నియమించారు.కార్పొరేషన్‌కు ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాని సర్కార్ పట్టించుకోకోవడంతో తన అసంతృఫ్తిని సోషియల్‌మీడియా ద్వారా వ్యక్తం చేశారు.ఇక నుంచి పూర్తి స్తాయి రాజకీయాల్లోకి రావాలని నిర్నయించు కున్నట్లు సమాచారం.
{loadmodule mod_custom,GA1}
ఐవైఆర్ ఇలా తీవ్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐవైఆర్‌కు జగన్ నుంచి హామీ కూడా లభించినట్లు తెలుస్తోందంటున్నారు. ఈ కారణంగానే బాబును ఫేస్‌బుక్‌లో టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఐవైఆర్ తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్నప్పటికీ.. ఈ విమర్శలు చేయడం వెనుక అర్థం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
కాగా, ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే కాకుండా.. ఇటీవల బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా పలు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి అరెస్టైన రవికిరణ్‌కు కూడా ఐవైఆర్ కృష్ణారావు మద్దతు పలికారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెటైర్లు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తారా? అంటూ నిలదీశారు.దీంతో భవిష్యత్తులో ఆయన వైసీపీనుంచి పోటీ చేసె అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
{youtube}hV7J8zXLvBI{/youtube}