Sunday, May 19, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియా అంట‌నే వ‌ణికిపోతున్న బాబు

- Advertisement -
Facebook Effect on IYR Krishna Rao

సోషియ‌ల్‌మీడియా అంటేనే చంద్ర‌బాబు ఆయ‌న బ్యాచ్‌కు గుండెల్లో వ‌ణుకు.ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పలువురు నెటిజన్లను అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ప్రభుత్వం … ఇప్పుడు ఏకంగా మాజీ సీఎస్, ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు వేసింది.

కేవలం ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం, నెటిజన్లు చేసిన పోస్టులను కృష్ణారావు షేర్‌ చేసుకోవడంపై చంద్రబాబు ఆగ్రహించారు. బ్రాహ్మణకార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ తన ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని చంద్రబాబు ఏమాత్రం సహించలేదు. ఐవైఆర్‌ను అవమానకరంగా తొలగించడంపై బ్రహ్మణసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

{loadmodule mod_custom,GA1}

చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత హాదాలో ఉన్న వ్యక్తిని అడిగి వివరణ తెలుసుకోకుండానే కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA2}

కార్పొరేషన్ నిధులపై ఐవైఆర్ ప్రశ్నించడాన్ని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు ఆయనను తప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.కేవలం సోషల్ మీడియాలో బ్రాహ్మణ కార్పొరేషన్ పై పోస్టులు చేశారన్న కారణంగా చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణారావు మీడియా సమావేశంలో పాల్గొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}fW3OIF-VwFc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -