Saturday, May 18, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ ఉండేది అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డానికి…

- Advertisement -
IYR Krishna Rao Press Meet Over Suspension

మాజీ సీఎస్ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.​ఫేస్ బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ అయిన వివాదాస్పద పోస్టులపై స్పందించారు.

ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని తనను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఐవీఆర్‌ను ప్ర‌భుత్వం తొల‌గించింది.
మీడియా ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అడిగి ఉంటే తన ఫేస్‌బుక్ పోస్టులపై వివరణ ఇచ్చేవాడినని ఆయన చెప్పారు.

{loadmodule mod_custom,GA1}

వివరణ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. సీఎంకు తాను జవాబుదారితనం లేకుండా వ్యవహరించాననడం సరికాదని అన్నారు. తాను 6నెలల నుంచి సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇవ్వడం లేదని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
ఏం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు ఆరోపణలు చేసినప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై సెటైర్లు వేశాడని రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంపైనా కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. మనమేమైనా ఫాసిస్టు ప్రభుత్వంలో ఉన్నామా? అని నిలదీశారు.

{loadmodule mod_custom,GA2}

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అరకొర నిధులు ఇస్తున్నారని కొద్దిరోజుల క్రితం తీవ్రంగా విమర్శించిన ఐవైఆర్.. చంద్రబాబుపై కులం కోణంతో ఉన్న పోస్ట్‌ను షేర్ చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలో కృష్ణారావు ఫేస్‌ బుక్‌ అకౌంట్ హ్యాక్ అయిందేమోనన్న అనుమానంతో కొందరు టీడీపీ నేతలు ఆయన్ను సంప్రదించారు. తానే పోస్టులు పెడుతున్నానని సమాధానం ఇవ్వడంతో టీడీపీ నేతల ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది.చంద్ర‌బాబుకు అంద‌రిలాగా బ‌జ‌న చేయ‌డం త‌న‌కు చేత‌కాద‌ని ఐవైఆర్ అన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

{youtube}H70hXihAEhU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -