Sunday, May 19, 2024
- Advertisement -

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్

- Advertisement -

ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగా పేరు సంపాదించిన ఓ ఆర్టిస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కింగ్ అంటు వార్తలు వ‌స్తున్నాయి.గ‌త కొన్నాళ్లుగా జబర్దస్త్ ప్రొగ్రామ్‌లో ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డంగా దొరికిన‌ట్లు స‌మాచారం.తిరుపతికి చెందిన ఇతని గురించి ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉండటంతో అతను ఎవరా అన్న ఆతృత జనంలో కలుగుతుంది.

సులభంగా డబ్బు సంపాదించాలన్న అతని ఆశ అడ్డదారులు తొక్కించిదని అలా మెల్ల మెల్లగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాతో పరిచయాలు ఏర్పరచుకుని ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించి ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేశార‌ని తెలుస్తుంది.ఆ నటుడిని అదుపులోకి తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు. మ‌రి ఆ జబర్దస్త్ ఎవ‌రో అని అంద‌రిలోను ఆస‌క్తి పెరుగుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -