Wednesday, May 15, 2024
- Advertisement -

రేవంత్ కు ఆ ‘రెడ్డి’ గారు హ్యాండిచ్చారు..!

- Advertisement -

తనకు తమ క్యాస్ట్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అంటూ చెప్పుకొంటూ ఉంటారు తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. తెలంగాణలోని రెడ్లు అందరూ తనకు సపోర్ట్ గా ఉంటారు అని.. ఏపీలో జగన్ ఉన్నడు కాబట్టి..

తెలంగాణలోనైనా రెడ్లను ఎంకరేజ్ చేయక తప్పదు కాబట్టి.. అధినేత చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చాడని ఏసీబీ విడుదల చేసిన వీడియో టేపుల్లో రేవంత్ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆయన కొంతమంది నేతల పేర్లను కూడా చెప్పుకొచ్చాడు!

జైపాల్ రెడ్డి తనకు మామ అని, జానారెడ్డి ముసలివాడయిపోయాడు.. తనకే మద్దతు పలుకుతాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఆ వీడియోల్లో ఉంది. మరి ఇలా పార్టీలకు అతీతంగా తనకు రెడ్లలో భయంకరమైన క్రేజ్ ఉందని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు జైల్లో ఉండగా.. ఆయన విషయంలో జానారెడ్డి స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది!

రేవంత్ రెడ్డి తీరును పూర్తిగా ఖండించాడు జానారెడ్డి. ఇలా ఒక ఎమ్మెల్యేను కొనడం హేయమైన చర్య అని జానా అభిప్రాయపడ్డాడు. రాజకీయాల్లో విలువలు పూర్తిగా చచ్చిపోయాయని జానారెడ్డి ఆవేదన వ్యక్తంచేశాడు. మరి రేవంత్ ఏమో జానారెడ్డి తనకు ఫుల్ సపోర్టుగా ఉంటాడని ప్రకటించుకొంటే.. జానారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి తీరుపై రివర్స్ లో దాడి చేశాడు. మరి తప్పుచేసి ఇరుక్కొంటే ఎవరైనా హ్యాండిస్తారులే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -