Monday, May 5, 2025
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్

- Advertisement -
jagan give warning chandhrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ అధినేత జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.రెండు రోజుల రైతు దీక్ష ముగింపు సంద‌ర్భంగా టీడీపీ ప్ర‌బుత్వాన్ని క‌డిగేశారు.ప‌రిపాల‌న‌లో పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లేక‌…వ‌రుస క‌రువుల‌తో అల్లాడుత‌న్న రైతాంగాన్ని క్షోభ పెట్ట‌డంతో త‌న రికార్డులు త‌నే బ‌డ్డులు కొట్ట‌కుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

రైతులు పండించే ఏపంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌నీ అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయ‌న్నారు.ప్ర‌భుత్వం రైతుల ప‌ట్ల అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.గ‌త ఎన్నిక‌ల్లో తాను రైతుల కోసం మూడు వేల కోట్ల‌తో స్థిరీక‌ర‌ణ పేరుతో నిధిని ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వెంట‌నే బాబు ఐదు వేల‌కోట్లోతో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని ..ఇప్పుడ‌ది తుంగ‌లోకి తొక్కార‌న్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న ఒక్క న‌య‌పైసా కూడా పెట్ట‌లేద‌ని మండ‌ప‌డ్డారు.

బ్యాంకుల్లో బంగారం మొద‌లు కొని రుణ‌మాఫీ వ‌ర‌కు ఇలా అన్నింటిలో బాబు మోసం కేశార‌న్నారు,క‌ష్టాల్లో ఉన్న అన్న‌దాత‌లకు అండ‌గా ఉంటామ‌ని ఇది ఇంత‌టితో ఆగ‌ద‌న్నారు. వ‌చ్చే నెల‌లో జీఎస్‌టీ బిల్లుకోసం ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నార‌ని అంత‌లోపు అన్న‌దాత‌ల క‌ష్టాల‌ను తీర్చాల‌ని లేకుంటే అసెంబ్లీని అడ్డుకుంటామ‌ని బాబును హెచ్చరించారు.అప్ప‌టికి కూడా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రాక‌పోతే ..పోరాటాన్ని మ‌రింత ఉదృతం చేస్తామ‌న్న‌రు. రైతుల‌ను క‌న్నీల్లు పెట్టించిన ప్ర‌భుత్వం పుట్ట‌గ‌తులు లేకుండా పోతుంద‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఇప్ప‌టికైనా అన్న‌దాత‌ల క‌ష్టాలను ప్ర‌భుత్వం తీరుస్తుంద‌ని రైత‌లు ఆశిస్తున్నారు.

{youtube}tjv3y22BbFw{/youtube}

Related

  1. జగన్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎక్క‌డ బాబు…?
  2. చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్
  3. జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
  4. జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -