Thursday, May 8, 2025
- Advertisement -

కాశ్మీర్ బ‌స్టాండ్‌లో స‌మీపంలో బ‌స్సుపై గ్ర‌నైడ్ విసిరిన వ్య‌క్తి అరెస్ట్‌…

- Advertisement -

ఉద‌యం జ‌మ్మూ, కాశ్మీర్‌లో బ‌స్సుపై గ్ర‌నైడ్‌తో దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దక్షిణ కాశ్మీర్ కుల్గాంకు చెందిన యాసిర్ ఆలియాస్ అర్హాన్ గా గుర్తించినట్లు డీజీపీ దిల్బార్ సింగ్ తెలిపారు. జ‌మ్మూనుంచి పారిపోతుండ‌గా అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉద‌యం జ‌మ్మూ బ‌స్టాండులో జ‌రిగిన గ్ర‌నైడ్ పేలుడులో దాదాపు 30 మంది గాయ‌ప‌డ్డారు. చికిత్స పొందుతూ ఓ టీనేజర్ చనిపోయాడు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించింన సంగ‌తి తెలిసిందే. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముందని అక్క‌డి అధికారులు తెలిపారు.పేలుడులో చనిపోయిన వ్యక్తి ఉత్తరాఖండ్‌కు చెందిన మహమ్మద్ షేక్ (17)గా గుర్తించారు. దాడిలో గాయపడ్డ వారిలో స్థానిక కాశ్మీరీలతో పాటు ఇద్దరు బిహారీలు, ఒకరు చత్తీస్‌గఢ్, మరకొరు హర్యానాకు చెందిన వ్యక్తి ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -