Wednesday, May 15, 2024
- Advertisement -

జంప్ జానా(?)!

- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలకు రెడీ అవుతున్న టీఆర్ఎస్.. ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసినట్టు కనిపిస్తోంది. త్వరలో జిల్లాల పర్యటనకు బయల్దేరుతున్న సీఎం.. అదే టైమ్ లో వేరే పార్టీల సీనియర్ నాయకులకు టీఆర్ఎస్ తీర్థం ఇచ్చే అవకాశాలున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

దీనికి సంబంధించి.. రీసెంట్ గా.. ఓ కొత్త రూమర్ కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. చాలా రోజులుగా అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్నట్టే కనిపిస్తున్న సీఎల్పీ నాయకుడు జానారెడ్డి.. వీలైనంత త్వరలో హస్తానికి హ్యాండిచ్చి కారెక్కే అవకాశం ఉందన్నదే.. ఆ తాజా పొలిటికల్ రూమర్. ఇది విన్న వాళ్లంతా.. డీఎస్ ను చూసి జానా ఆలోచించుకోవాలని సలహా ఇస్తున్నారట.

టీఆర్ఎస్ లోకి వెళ్లాక.. ప్రభుత్వ సలహాదారు పోస్టు తప్ప.. ప్రాధాన్యం లేకుండా ఉన్న డీఎస్ లాగే.. జానా పరిస్థితి తయారయ్యే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారట. కానీ.. ఇదేదీ పట్టని జానా మాత్రం.. తన ‘నిర్ణయానికే’ కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహితుల మాటలను బట్టి కన్ఫమ్ అవుతోంది.

టీఆర్ఎస్ లో జానా చేరితే.. మరింత మంది సీనియర్లు ఆయన బాటలో వెళ్లడం ఖాయం. ఇదే జరిగితే.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారడం కూడా ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -