Sunday, May 5, 2024
- Advertisement -

జో బైడెన్​ కుమారుడి​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ కుమారుడి​పై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పరిపాలనా విభాగం దృష్టిసారించినట్లు కనపడుతోంది. ఈ మేరకు పన్నులకు సంబంధించిన అంశంపై దర్యాప్తును ఎదుర్కొంటున్నట్లు తెలిపారు హంటర్​ బైడెన్​. జో బైడెన్ ఎన్నికల ప్రచారాల్లో హాంటర్​ ఆర్థిక లావాదేవీల పాత్రపై ఈ దర్యాప్తు కొనసాగే అవకాశముంది.

విచారణకు హాజరుకావాలని కోరుతూ గత మంగళవారం మరోమారు హంటర్​ బైడెన్​కు సమన్లు జారీ చేశారు ఫెడరల్​ అధికారులు. దర్యాప్తు గురించి తనకు మంగళవారం సమాచారం అందినట్లు హంటర్​ బైడెన్ ప్రకటనలో వెల్లడించారు. కానీ ఎలాంటి విషయాలు బహిరంగపరచలేదు.

ఆదాయ పన్ను మోసం నేరాలపై న్యాయ విభాగం దర్యాప్తు.. జో బైడెన్​ తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించటానికి ఏడాది ముందే ప్రారంభించినట్లు ఓ అధికారి తెలిపారు. బహిరంగ దర్యాప్తు చర్యలను నిషేధించే ఎన్నికల విధానాల వల్ల కొద్ది వారాలుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -