Friday, May 17, 2024
- Advertisement -

ప‌ర‌మ‌ప‌దించిన కంచిపీఠాధిప‌తి జ‌యేంద్ర స‌రస్వ‌తి…

- Advertisement -

కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఆయన శివైక్యం చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం.

కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన శివైక్యం చెందారు. ఆయన మరణానికి సంబంధించిన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మరణ వార్తతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి 1935 జూలై 18న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఇరునీకల్ గ్రామంలో ఆయన జన్మించారు. 1954 మార్చి 22న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్ తర్వాత ఆయన బాధ్యతలను చేపట్టారు. జయేంద్ర సరస్వతి కంచి పీఠానికి 69వ పీఠాధిపతి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -