Monday, May 13, 2024
- Advertisement -

రానా చెప్పిన డైలాగ్స్ ఎవరికి తగులుతాయి..?

- Advertisement -

నేనే రాజు నేనే మంత్రి మూవీలో తన భార్య చనిపోతే.. ఆ క్రమంలో సింపతి ద్వారా సీఎం కుర్చీ టార్గెట్ చేస్తాడు హీరో. ఇందుకు సంబంధించి వచ్చిన డైలాగులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. హీరో శవ రాజకీయాలు చేస్తున్నాడని.. అతడికి జనాల్ని దగ్గరికి తీసుకోవడం.. చెంపలు పట్టుకోవడం.. బాగా వంట పట్టిందని ఓ పంచ్ డైలాగ్ వేస్తాడు విలన్. ఈ సందర్భంలో.. ఈ డైలాగ్స్ ప్రతి పక్ష నేత జగన్‌ను ఉద్దేశించి పెట్టినవే అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది.

వైఎస్ చనిపోయాక ఆయన పార్థివ దేహం ఇంట్లో ఉండగానే రాజకీయాలు చేసే ప్రయత్నం చేశాడని తెలుగుదేశం నాయకులు అతడి మీద విమర్శలు చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ మూణ్నాలుగేళ్ల పాటు.. చేసిన ఓదార్పు యాత్ర విషయంలోనూ అనేక కామెంట్స్.. సెటైర్లు ఎదుర్కొన్నాడతను. జనాల్ని దగ్గరికి తీసుకోవడం.. తల నిమరడం.. కొందరికి ముద్దులు పెట్టడం.. బుగ్గలు పట్టుకుని మాట్లాడటం.. ఇలాంటివి చాలానే చేశాడు జగన్. దాని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది అప్పట్లో.

సమకాలీన రాజకీయ అంశాల ప్రస్తావన చాలానే చేసిన తేజ.. జగన్‌ను ఉద్దేశించే చివర్లో సన్నివేశాలు అల్లుకున్నాడని.. డైలాగులు పెట్టాడని జనాలు చర్చించుకుంటున్నారు. అలాగని మిగతా పార్టీల వాళ్లనేమీ తేలిగ్గా వదిలిపెట్టేయలేదు తేజ. ప్రస్తుతం రాజకీయాల్లోని జంప్ జిలానీల గురించి సైటైర్లు గుప్పించడం ద్వారా టీడీపీ పార్టీని కూడా టార్గెట్ చేసుకున్నాడు. మొత్తంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ ద్వారా.. తేజ మన రాజకీయ వ్యవస్థ మీద బాగానే సెటైర్లు పేల్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -