Saturday, May 11, 2024
- Advertisement -

న్యూ ఇయర్ వేడుక‌ల‌కు స‌న్నీకి క‌ర్నాట‌క‌ షాక్‌

- Advertisement -

న్యూ ఇయర్ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం వ‌స్తున్న స‌న్నీలియోన్‌కు క‌ర్నాట‌క స‌ర్కార్ షాకిచ్చింది. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం బెంగ‌ళూరులో ఏర్పాట్లు చేసుకున్న స‌న్నీలియోన్‌ను త‌మ రాష్ట్రానికి రావొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ వేడుక‌ల్లో సంద‌డి చేయ‌డానికి వెళ్తున్న ఆమెకు ఈ ప‌రిణామం మింగుడు ప‌డ‌డం లేదు. మాజీ పోర్న్ బ్యూటీ సన్నీలియోన్ కూడా కర్నాటకలో నిర్వ‌హించే న్యూ ఇయ‌ర్ వేడుక‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి ఒప్పుకుంది.

సన్నీలియోన్ తమ రాష్ట్రంలోకి వ‌స్తే క‌న్న‌డ కుర్రాళ్లు పాడయిపోతారని.. తమ సంస్కృతికి వ్య‌తిరేక‌మ‌ని కర్నాటకలో ఓ ఉద్యమం కొన‌సాగుతోంది. ఈ చిన్న ఉద్య‌మాన్ని సాకుగా చెబుతూ సన్నీలియోన్ న్యూ ఇయర్ కార్య‌క్ర‌మాల‌కు అనుమతి నిరాకరించినట్లు కర్నాటక పోలీసులు స్ప‌ష్టం చేశారు. గతేడాది మహాత్మాగాంధీ రోడ్డులో జరిగిన ఓ కేసుపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి.. మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు స‌మాచారం.

అయితే.. షో క్యాన్సిలేషన్ పై అధికారిక సమాచారం రాలేదంటున్నారు నిర్వాహకులు. ఆమె ఇక్కడ నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం లేదని.. ఓ ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకే వచ్చిందని చెబుతున్నారు. సన్నీ లియోన్ షో గురించి ఇంత రాద్ధాంతం అవసరం లేదన్నది వారి వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -