Sunday, May 5, 2024
- Advertisement -

మన ఆర్భాటమే కొంపముంచుతుంది

- Advertisement -

మన ఇండియన్స్ ను ఎక్కడికి తీసుకుపోయినా.. మన బుద్దులు మాత్రం మార్చుకోరనే విషయం ప్రపంచానికి భాగా తెలిసిపోయినట్లుంది. అందుకే మనల్ని మన సెంటిమెంట్స్ ని బేస్ చేసుకుని ఎత్తుకు పై ఎత్తు వేసి ఎలా మోసం చేయాలో పాశ్చ్యాత్తులు అర్ధం చేసేసుకున్నారు.దానిలో భాగంగా ముందుగా ఇంగ్లాండ్ లో దొంగలు మన ఇండియన్స్ మూలాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ మన ఇండియన్స్ సెంటిమెంట్ గా భావించే గోల్డ్ ను అక్కడి దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారు.

తాజాగా బ్రిటన్ మిల్టన్ కీన్స్ పట్టణంలో దక్షిణ ఆసియా దేశ ప్రజలే లక్ష్యంగా చేసి చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు అక్కడి దొంగలు. లండన్ కి 72కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణం. ఈ మిల్టన్ కీన్స్ పట్టణంలో భారతీయులే ఎక్కువగా నివసిస్తుంటారు. అక్కడి బ్రిటన్ దొంగలు భారతీయ గృహాలనే లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే భారతీయులు భారీ స్థాయిలో బంగారు నగలను ధరిస్తారు కనుక ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

మొత్తం బ్రిటన్ లో జరిగే సగటు కంటే ఈ పట్టణంలో జరిగే దొంగతనాలే ఎక్కువట. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దక్షిణ ఆసియా దేశ ప్రజలపైనే వరుస దాడులు జరుగుతున్నాయి. 2016లో బ్రిటన్‌లో సుమారు 3,463 దొంగతనాలు జరిగితే అన్నీ బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులే కావడం గమనార్హం. దక్షిణాసియా దేశస్థుల నుంచి 430 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నట్లు లండన్ పోలీసులు చెపుతున్నారు.దీన్ని బట్టి మనవాళ్లు ఏ స్థాయిలో లండన్ లో బంగారు నిల్వలను పోగు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -