వంటలక్క ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో కదా? అవును నిలమే.. ఎంతో మాములు సీరియల్ గా ప్రారంభమైన కార్తీకదీపం ఏకాంగా టాప్ ప్లేసుకు చేరిందంటే.. కారణం అందులో యాక్ట్ చేసే వంటలక్కగా పిలిచే దీపే కారణం. అయితే ఈ సీరియల్ మిగతా వాటితో పోలీస్తే ఎంతో డిఫరెంట్ . ఎందుకంటే ప్రతీ సీరియల్ లో యాక్ట్ చేసే లీడ్ రోల్ లేడీ యాక్టర్లు వైట్ గా ఉంటారు. కానీ ఈ సీరియల్ లో మాత్రం బ్లాక్ గా ఉంటుంది.
ఇలా ఇందులో యాక్ట్ చేసే హీరోయిన్ పూర్తిగా నల్లగా మేకప్ వేసుకున్నందుకో ఏమో కానీ ప్రేక్షకులకు ఆ క్యారెక్టర్ తెగ నచ్చేసింది. ఇలా కనెక్ట్ అయిన వంటలక్క బుల్లి తెరను ఏలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు ఎన్నో రకాల సీరియల్ వస్తున్నా కానీ కార్తీక దీపం సీరియల్ ను మాత్రం బీట్ చేయడంలేదు.
అయితే ప్రస్తుతం వంటలక్కను మరిచిపోయేలా చేసేందుకు మరో అక్క రాబోతుందని పలువురు చెబుతున్నారు. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క ఎలాగయితే నల్లటి రంగులో ఉండి కష్టాలు పడుతూ ఉంటుందో అచ్చం అలాగే మరో క్యారెక్టర్ తో ఇంకో సీరియల్ రాబోతుంది. ఆ సీరియలే కృష్ణ తులసి. ఇటీవల ప్రారంభమైన ఈ కృష్ణ తులసి సీరియల్లో శ్యామ అనే నటి మెయిన్ లీడ్ నటిస్తోంది. అచ్చంగా కార్తీకదీపం కథాంశం లాగే ఇది ఉంది. మరీ వంటలక్కను ఈ శ్యామ మైమరిపిస్తుందో వేచి చూడాలని పలువురు అంటున్నారు.
కృతి శెట్టి గురించి మీకు తెలియని విషయం ఇది!
కవల పిల్లలను ఎత్తుకుపోయిన కోతులు..శిశువు మృతి