కార్తీక మాసంలో సోమవారాలు అతి విశిష్టమైనవి అని చాలామంది నమ్ముతుంటారు.శివానుగ్రహాం పొందాలంటే చాలామంది మహిళలు కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటారు.అయితే శివుడి అనుగ్రహం పొందడం ఎలా అనే కార్తీక పురాణంలో తెలిపారు. దీనిలో కార్తిక సోమవారం ఎలా చేయాలి అనేది తెలిపారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు మార్గాల ద్వారా కార్తీక సోమవారం చేయవచ్చని సూచిస్తుంది.కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉన్నంత ఉత్తమం మరోకటి లేదు.ఇలా ఉపవాసం ఉండ కలిగిన వారు ఉదయం పూట తులసీ తీర్థం పుచ్చుకుని శివానామ స్మరణతో కాలం గడపాలి.ఆ రోజు రాత్రి జాగారం చేసి మరునాడు అన్నదానం చేసిన తరువాత ఉపవాసం ముగించాలి.ఇక రెండో పద్దతి ..ఉదయం వేళ ఆహరం తీసుకుని రాత్రి వేళ ఉపవాసం ఉంటారు.
ఈ పద్దతిని ఏకవ్యక్తం అంటారు.మూడో పద్దతిలో పగలు అంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి ఉపవాసం ముగిస్తారు.ఈ పద్దతిని నక్తవృతం అంటారు.నక్తవృతాన్ని కార చాలామంది పాటిస్తుంటారు.పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రికి ఎవరైనా స్వల్పాహారాన్ని స్వీకరిస్తారు.దీనిని అయాచిత వృత్తం అంటారు.అసలు ఉపవాసం ఉండలేని వారు తెల్లవారుజామునే స్నానం చేసి శివనామస్మరణ చేయడాన్ని ఐదో పద్దతిగా కార్తీక పురాణం చెబుతుంది.ఇలా కూడా చేయలేని వారు నువ్వులు దానం చేయడం అనేది చివరిదిగా ఉందట.నువ్వులు దానం చేయడం ద్వారా చేసిన పాపాలు పోతాయని కార్తీక పురాణంలో ఉందని చాలామంది నమ్ముతుంటారు.ఈ ఆరు పద్దతులలో ఏ పద్దతి పాటించిన కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం ఉంటుందని కార్తీక పురాణంలో రాసి ఉంది.