Saturday, May 18, 2024
- Advertisement -

క‌రుణానిధి ఆరోగ్యం విష‌మం..పోలీసుల హైఅల‌ర్ట్‌..సీఎం ప‌ళ‌నిస్వామితో స్టాలిన్ భేటీ

- Advertisement -

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం బాగా విషమించిందని కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి లోపల, బయట పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తమిళనాడు పోలీసులు హైఅలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో కరుణానిధి తనయుడు, స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లారు. తన తండ్రి ఆరోగ్యం గురించి, ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి సీఎంకు వివరించారు. కరుణానిధి పరిస్థితి విషమంగా ఉండటం.. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న నేపథ్యంలో స్టాలిన్ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Image result for karunanidhi-health-

ఇదిలా ఉండగా, కావేరి ఆసుపత్రి వద్దకు కరుణానిధి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధికి సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పోలీస్ అధికారులందరూ చెన్నైకి రావాల్సిందిగా చెన్నై డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న డీఎంకే పార్లమెంట్ ఎంపీలు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా అన్నా అరివాలయం ఆదేశాలు పంపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -