Sunday, May 19, 2024
- Advertisement -

దుర్గమ్మ చీరె మాయం : ట్ర‌స్ట్‌బోర్డు మెంబ‌ర్ సూర్య‌ల‌తపై వేటు ..

- Advertisement -

బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు ఆయన చైర్మన్‌ గౌరంగబాబు సూర్యలతపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఐదవ తేదీన దుర్గమ్మకు ఉండవల్లికి చెందిన భక్తులు సుమారు రూ18వేల విలువైన చీరను బహుకరించారు.ఈ చీరను ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో నేయించారు. అమ్మవారిని చీరెను సమర్పించి కౌంటర్‌లో రశీదు తీసుకొని వచ్చే వరకు చీర మాయమైంది.

చీర మాయ‌వ‌డంపై రాజ‌కీయ‌పార్టీల‌నుంచి, భ‌క్తుల‌నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ఆ సమయంలో అక్కడ ఉన్న అర్చకులు, సిబ్బంది, భక్తులను విచారించిన దేవాలయా ఈవో పోలీసులకు ఓ నివేదికను అందించారు. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత ఈ చీరెను మాయం చేశారని పోలీసులకు నివేదిక ఇచ్చారు.

దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా పాలకవర్గం నుండి కోడెల సూర్యలతను తప్పించారు. విచారణ పూర్తయ్యే వరకు పాలకవర్గం నుండి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -