- Advertisement -
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ తెల్లవారు జామున ఐదున్నర గంటల సమయం లో కొత్త ఇంట్లో ప్రవేశం చేసారు. వేద పండితులు నిర్ణయించిన టైం కి ఆయన తన కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. అంత ఉదయం ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామీ తో సహా పలువురు మంత్రులు , ప్రముఖులు విచ్చేశారు.
38 కోట్ల రూపాయల అంచనాలతో మూడు బ్లాకుల నిర్మాణం చేపట్టారు కూడా. ఐదు భవనాల సముదాయానికి ప్రగతి భవన్ గా నామకరణం చేసారు. ప్రాంగణం మొత్తం పచ్చదనం తో నిండిపోయింది. ఏకకాలంలో వెయ్యిమందితో సమావేశమయ్యేలా సమావేశమందిరాన్ని తీర్చిదిద్దారు. సమావేశ మందిరానికి ‘జనహిత’ అనే పేరు పెట్టారు.