Friday, May 3, 2024
- Advertisement -

శభాష్ కెసీఆర్……. పేపర్ గాండ్రింపులకూ….. ఒరిజినాలిటీకి తేడా చూపించావ్

- Advertisement -

సాగిలపడిపోయి ఉండే నాయకుడి దగ్గర పనిచేయడం ఎంత కష్టంగా ఉంటుందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా రాజీనామాలు, అవిశ్వాస తీర్మానానికి సై అన్నాడు. జగన్‌ని ఇరికించడానికే పవన్ కళ్యాణ్ ద్వారా అవిశ్వాస తీర్మానం జగన్‌పైకి వదిలాడు చంద్రబాబు. అయితే జగన్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అవిశ్వాస తీర్మానానికి సై అన్నాడు. దెబ్బకు పవన్-బాబులు డిఫెన్స్‌లో పడిపోయారు. ఆ తర్వాత నుంచీ అవిశ్వాస తీర్మానంతో ఉపయోగం లేదు అని బాబు సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళాడు. అధికారంలో ఉన్న బాబుకంటే జగన్‌కే ధైర్యం ఎక్కువ, ఎపి ప్రయోజనాల కోసం పోరాడే విషయంలో చిత్తశుధ్ధి ఎక్కువ అని మరోసారి రాజకీయ విశ్లేషకులు ప్రశంశించేలా చేసుకున్నాడు జగన్.

ఇక ఇప్పుడు కెసీఆర్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. చక్రం తిప్పా, మొత్తం చేశా…..లేస్తే మనిషిని కాదు అంటూ ఎంత సేపూ తన భజన మీడియాలో రాయించుకోవడం తప్పితే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు కేంద్రప్రభుత్వం దగ్గర బానిసలాగా ఉన్నాడన్నది నిజం. టిడిపి స్థాపనకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇందిరాగాంధీ దగ్గర చూపించిన బానిసత్వం కంటే ఎక్కువ చూపిస్తున్నాడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయం ఎలా చేయాలో? లీడర్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు కెసీఆర్. శషబిషలు, డొంక తిరుగుడు వ్యవహారాలు, రెండు నాలుకల మాటలతో కాదు…..దమ్ము, నిజాయితీ ఉంటే బాజాప్తా పోరాటానికి సిద్ధపడాలి. తెలంగాణా ఉద్యమం విషయంలో కూడా కెసీఆర్ అదే చేశాడు. ఇప్పుడు కూడా అదే దూకుడు. మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఏం చేస్తున్నాడు?

మీడియా గాండ్రింపులతో ……. రెండు నాలుకల వ్యవహారాలతో 2019 ఎన్నికల వరకూ టైం పాస్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌లా దమ్ము చూపించలేడు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్‌లా ధైర్యంగా యుద్ధానికి దిగలేడు. అలాంటి చంద్రబాబును వీరుడు, శూరుడు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి ఆంధ్రజ్యోతి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు నవ్వు పుట్టిస్తున్నాయి. చేతల్లో ఏమీ చేతకాని చంద్రబాబు మాటల్లో మాత్రం గొప్పగా చెప్పుకుంటూ మాయ చేయాలని చూస్తున్నాడు. ఇక చంద్రబాబు భజనసేనుడు పవన్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆ నటనాయకుడు బానిసకే బానిస కదా? ఏం మాట్లాడతాం. మొత్తంగా చూస్తే ఆడు మగాడ్రా బుజ్జీ అని మరోసారి ఆంధ్రుల చేత కూడా అనిపించుకున్నాడు కెసీఆర్. అధికారంలో లేకపోయినప్పటికీ జగన్ ప్రయత్నాలు కూడా తెలుగు ప్రజలకు నచ్చుతున్నాయి. చంద్రబాబు చేతకాని మాటల రాజకీయం, పవన్ కళ్యాణ్ టైం పాస్ వ్యవహారాలు మాత్రం ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -