Wednesday, April 24, 2024
- Advertisement -

పాపం బిచ్చగాడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి

- Advertisement -

తమిళ నాట విజయవంతమైన హీరో విజయ్ ఆంటోనీ. తాను ఎన్ని సినిమాలు చేసినా అంతే ఒదిగి ఉంటూ పేక్షకులకి ఇంకా ఏదో కొత్త రకమైన కథ చెప్పాలి అని తపిస్తూ ఉంటాడు. సంగీత దర్శకుడిగా సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టినా కానీ క్రమక్రమం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని హీరో గా ఇప్పుడు ఒక పెద్ద స్థానం లో కి ఎగబాకాడు. అయితే ఈ హీరో మిగిలిన వాళ్ళ లాగానే తెలుగు లో కూడా పాగా వేయాలనే ఉదేశ్యం తో మన ముందుకు బిచ్చగాడు అనే సినిమా తో వచ్చాడు. ఈ సినిమా తెలుగు లో పెద్ద విజయం సాధించడమే కాకుండా విజయ్ ఆంటోనీ కి ఎంతగానో ఉపయోగపడింది.

ఏ రేంజ్ లో ఆ సినిమా ఉపయోగపడింది అంటే అసలు విజయ్ ఆంటోనీ కి తెలుగు లో తిరుగు ఉండదు అనే రేంజ్ లో ఉపయోగపడింది. బిచ్చగాడు తర్వాతా ఈ హీరో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయినా కానీ ఓపెనింగ్స్ మాత్రం అద్భుతం గా వచ్చాయి. ఇదంతా బిచ్చగాడు సక్సెస్ మహిమ అంటారు కొందరు. ఇకపోతే ప్రస్థితం ఈ హీరో కిల్లర్ అనే సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదల అవుతుంది కానీ ఎందుకో ఏమో కానీ ఈ సినిమా ని తీసుకోవడానికి ఎక్కువ మంది సుముఖత చూపించలేదు. చాలా తక్కువ రేటు కి ఈ సినిమా అమ్ముడుపోవడం తో అసలు పెట్టిన డబ్బు వస్తుందా లేదా అనే స్థితి దావురించింది విజయ్ కి.

కానీసమ్ ఈ సినిమా తో అయినా విజయం సాధించి తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు విజయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -