Wednesday, May 15, 2024
- Advertisement -

కెసిఆర్ కు ఓటేయండి – కోమటిరెడ్డి

- Advertisement -

ప్రతిపక్షం కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి అభిమాన పాత్రులయ్యింది. నిన్న, మొన్నటి వరకూ కె.చంద్రశేఖర రావుపై కారాలు.. మిరియాలు నూరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా ఆయనకు ఐ లవ్ యు చెబుతున్నారు.

తెలంగాణ నీటి పారుదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కెసిఆర్ పై కాంగ్రెస్ అగ్రనాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేస్తే మరో నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పొగడ్తలతో ముంచెత్తారు. అదేదో సినిమాలో పోసాని కృష్ణ మురళి అన్నట్లు ఐ ల్ యు రాజా అని కూడా అంటున్నారు.  

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా గొప్పగా ఉందంటూ పొగిడారు. అంతే కాదు డబుల్ బెడ్ రూం ఇళ్లు హైదరాబాద్ లోనే కాదు నియోజకవర్గాల్లో కూడా కట్టిస్తే కెసిఆర్ ఓటేయమి తానే ప్రచారం చేస్తానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ పొగడ్తల వెనుక కోమటిరెడ్డి మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా అని ఆ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -