- Advertisement -

తమన్నా రేటు పెంచేసింది!

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నది. ఓ వైపు వరుస హిట్స్, మరోవైపు గ్లామర్ షోకి అభ్యంతరాలు చెప్పకపోవడం…ఈ భామ డిమాండ్ ని అమాంతం పెంచేశాయి. దాంతో పారితోషికం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట తమన్నా. బాహుబలి విడుదలైన తర్వాత తమన్నా పారితోషికాన్ని భారీగానే పెంచేసింది.

ఇండియాలోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచినా సినిమా అవడంతో…తమన్నా డిమాండ్స్ కి తలొగ్గక తప్పలేదు. అయితే ఇప్పుడు ఊపిరి సినిమా విడుదలై హిట్ అవడంతో మళ్ళీ రేటు పెంచినట్లు సమాచారం. తాజాగా ఓ ప్రాజెక్ట్ కోసం తమన్నాను కలసిన నిర్మాతకు భారీ ధర చెప్పి షాక్ ఇచ్చిందట తమన్నా. ఊపిరి సినిమాలో తమన్నా పాత్ర చేపుకోదగ్గదేమి కాదు.

 ఈమె నటనకు కూడా గొప్ప పేరేమి రాలేదు. అయినా సరే బెంగాల్ టైగర్, ఊపిరి వంటి వరుస హిట్స్ కారణంగా రేట్ భారీగానే పెంచేసిందని అంటున్నారు. దాదాపు అన్ని భాషల నుంచి డిమాండ్ ఉండడంతో ఆఫర్స్ క్యూ కడుతుండడంతో….దాన్ని క్యాష్ చేసుకునేందుకు తమన్నా వసూలు విషయంలో స్ట్రాంగ్ గా ఉందని టాక్. ఇక బాహుబలి 2 తర్వాత ఈమెను అందుకోవడం చాలా మందికి కష్టం అవుతుందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -