Monday, May 27, 2024
- Advertisement -

మంత్రి హరీష్ రావుతో సమావేశమైన కోమటిరెడ్డి

- Advertisement -

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడేలా ఉంది. ఆ జిల్లాలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తిలోదకాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఆయన తెలంగాణ మంత్రి టి.హరీష్ రావుతో సమావేశమయ్యారు.

దాదాపు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో కోమటిరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖరారైనట్లే. అయితే ఆయన ఒక్కరే పార్టీలో చేరతారా.. తన సోదరుడ్ని కూడా తీసుకుని వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. శుక్రవారం నాడు అమెరికా నుంచి వచ్చిన కోమటిరెడ్డి శనివారమే మంత్రి హరీష్ రావుతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

మరోవైపు నల్లగొండ జిల్లాకు చెందిన మరో నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ చేరడం ఖరారు కావడంతో ఇక నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పని గల్లంతైనట్లే అని అంటున్నారు. టిఆర్ఎస్ కు కొరుకుడు పడని జిల్లాలను ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యూహంతో తనవైపు తిప్పుకుంటున్నారు. ఇదీ రాజకీయమంటే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -