Friday, May 17, 2024
- Advertisement -

కేసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన లగడపాటి రాజగోపాల్!

- Advertisement -

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలీదు.. ఎవరు మిత్రులవుతారో, ఎవరు శత్రువులవుతారో ఊహించలేం. అలానే ఒకప్పుడు మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, సిఎం కేసిఆర్ మధ్య తెలంగాణ ఉద్యమ సమయంలో మాటల తూటాలు పేల్చుకుంటూ ఛాలెంజ్‌ల మీద ఛాలెంజ్‌లు వేసుకున్నారు. నువ్వానేనా అనే రేంజ్‍లో ఇద్దరూ అప్పట్లో చెలరేగిపోయారు.

తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి అప్పట్లో ఛాలెంజ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ సిఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పుష్కరాల కోసం సిఎం కేసిఆర్ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పుష్కరాల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం అభినందనీయమన్నారు. ఇవాళ ఆయన కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లలో కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించారు. కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి వారిని దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానీ లగడపాటి కేసిఆర్‌పై అప్పట్లో చాలా ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అలాంటిది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలా కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -