Friday, May 17, 2024
- Advertisement -

ఎమ్మెల్యేను తాళ్ళతో కట్టేసి నిలదీసిన ప్రజలు!

- Advertisement -

ఉత్తరపదేశ్‌లో ఊహించని సంఘటణ చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు కాని అవి ఎవరో కొందరు మాత్రమే నెరవేరుస్తుంటారు.

కానీ అలా నెరవేర్చనందుకు ఉత్తరప్రదేశ్‌లోని చందోలీ నియోజకవర్గానికి చెందిన బీఎస్సీ ఎమ్మేల్యే జబ్బన్‌సింగ్ చౌహాన్‌ను, అలాగే ఆ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్‌ను ప్రజలు తాళ్ళతో కట్టేశారు. బిసి కాలనీలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మేల్యే జబ్బన్‌సింగ్, కౌన్సిలర్‌ ఇద్దరు కలిసి ఆ కాలనీకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఇంతకు ముందు ఇచ్చిన విద్యుత్ హామి ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు నిలదీశారు.

తర్వాత వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు ఇరువురిని తాళ్ళతో కట్టేశారు. సమాధానం చెప్పి ఇక్కడి నుంచి కదలాలని వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేశారు. ఇక చేసేది ఏమీ లేక ఆ ఎమ్మెల్యే ప్రజలకు ఎలగోల నచ్చజెప్పుకొని, క్షమాపణలు చెప్పి, విద్యుత్ సమస్యను త్వరలో తీరుస్తానని హామి ఇవ్వటంతో ప్రజలు ఇద్దరిని వదిలిపెట్టారు.

ప్రజా తీర్పును గౌరవిస్తానని, వారి అసంతృప్తిని ఇలా తెలియజేశారని ఇందులో తప్పేమి లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలా చేయడం  వల్ల ప్రజా సమస్యలు రాష్ట్రానికి, దేశానికి తెలుస్తాయని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -