Monday, May 5, 2025
- Advertisement -

పవన్ కళ్యాన్ తిరుపతి ప్రచారంలో ఉద్రిక్తత!

- Advertisement -

తిరుపతి లో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. బీజేపీ, జనసేన రత్నప్రభకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకి మద్దతుగా తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇక  పవన్ చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ పాదయాత్ర మార్గం అభిమానులతో కిక్కిరిసిపోయింది. పవన్ కళ్యాన్ ప్రచారం చేస్తున్నారని తెలిసి.. ఎమ్మార్ పల్లె, అన్నమయ్య సర్కిల్, శంకర బాడీ సర్కిల్ వద్ద భారీగా అభిమానులు మోహరించడంతో అభిమానులు మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

అభిమానులు ఎక్కుగా రావడంతో పవన్ కారు దిగి నడిచారు.  ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ కింద పడ్డాడు. దీంతో అభిమానుల తాకిడి తట్టుకోలేక మధ్యలో ఓపెన్ టాప్ వెహికల్ ఎక్కిన పవన్ కల్యాణ్ సభా స్థలికి బయలుదేరారు.


నానమ్మ తాతల పేరు తో కేటీఆర్ నిర్మాణం.. ఎక్కడంటే..!

వైసీపీ నుంచి మరో నాయకుడు జంప్.. పార్టికి రాజీనామా..!

ఫ్రీ గా ఇళ్లు.. కేటీఆర్ ఏమన్నారు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -