Tuesday, April 23, 2024
- Advertisement -

ఫ్రీ గా ఇళ్లు.. కేటీఆర్ ఏమన్నారు అంటే..!

- Advertisement -

సిరిసిల్ల జిల్లాకు 6,886 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో పేదలకు డబ్బా ఇళ్లు కట్టించి ఇచ్చారని… మూడు రంగుల ఇళ్ల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారని విమర్శించారు. ప్రస్తుతం పేదలకు అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని… రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేటీఆర్…. మోహినికుంటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సింగిల్‌విండో పెట్రోల్ బంకును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రెండు పడక గదుల ఇళ్లు, రైతువేదికకు శ్రీకారం చుట్టారు. ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైనందుకు పాలకవర్గానికి సన్మానం చేశారు.

మద్దికుంట, చీకోడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు ముస్తాబాద్‌లో రైతువేదికను ప్రారంభించనున్నారు. మూడు గంటలకు ఆవునూరు, మూడున్నరకు హరిదాసునగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

తిరుపతి ఆలయం పై కొత్త వివాదం.. అర్చకులకు మళ్లీ అవకాశం..!

తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్త‌గా 1,078 కేసులు!

దారుణం.. గోదావరిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -