Saturday, April 27, 2024
- Advertisement -

నానమ్మ తాతల పేరు తో కేటీఆర్ నిర్మాణం.. ఎక్కడంటే..!

- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో రైతు వేదికను ప్రారంభించారు. తన నానమ్మ తాతల పేరు మీద రైతువేదిక భవనాన్ని నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. వరి సాగులో తెలంగాణ.. దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు.

తెలంగాణలో యాసంగిలో 52 లక్షల 76 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం తర్వాత తమిళనాడు రెండో స్థానం ఉన్నట్లు చెప్పారు. రైతులు ఇబ్బంది పడకూడదని 6,400 పైచిలుకు ధాన్యం కొనగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎక్కడికక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పి…. రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయలను ఇవ్వలేదన్నారు.

వైసీపీ నుంచి మరో నాయకుడు జంప్.. పార్టికి రాజీనామా..!

ఫ్రీ గా ఇళ్లు.. కేటీఆర్ ఏమన్నారు అంటే..!

హై కోర్టు కి జనసేన.. ఎన్నికల వేడి మామూలుగా లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -