Saturday, April 20, 2024
- Advertisement -

వైసీపీ నుంచి మరో నాయకుడు జంప్.. పార్టికి రాజీనామా..!

- Advertisement -

వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంచి ముహూర్తం చూసుకుని ఓ జాతీయ పార్టీలో చేరతానని ప్రకటించారు. జాతికోసం… దేశం కోసం… సమాజం కోసం ఆలోచించే పార్టీలో చేరి… 2023లో హుజూర్​నగర్ ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వెల్లడించారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో జరిగిన సమావేశంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.

రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా… ఇప్పటికీ నిరుద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారని శ్రీకాంత్​రెడ్డి ఆరోపించారు. ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

యాదాద్రికి నిధులు ఇవ్వడం తప్ప తెరాస ఒరగబెట్టిందేమీలేదని.. ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదని తెరాసపై ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో… అభివృద్ధి కావాలో… డబ్బు కావాలో… ప్రజలు తెల్చుకోవాలన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే తాను స్వాగతిస్తానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. షర్మిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఫ్రీ గా ఇళ్లు.. కేటీఆర్ ఏమన్నారు అంటే..!

హై కోర్టు కి జనసేన.. ఎన్నికల వేడి మామూలుగా లేదు..!

తిరుపతి ఆలయం పై కొత్త వివాదం.. అర్చకులకు మళ్లీ అవకాశం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -