Tuesday, May 14, 2024
- Advertisement -

కింగ్ ఫిషర్ కు ఆర్ బి ఎస్ సేవలు బంద్

- Advertisement -

భారత్ లో బ్యాంకులను ముంచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు గ్లోబల్ బ్యాంకింగ్ లో పెద్దదైన రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్ బి ఎస్) తన సేవలను నిలిపివేయనున్నది.

విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ కు వచ్చే నెల నుంచి ఎలాంటి రుణం, ఇతర బ్యాంకింగ్ సేవలు కాని చేయరాదని నిర్ణయించింది. మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ విదేశీ బీర్ బిజినెస్ ను కాలిఫోర్నియకేంద్రంగా ఉన్న మెండోసిసక బ్రూవింగ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది.

అమెరికాలో కింగ్ ఫిషర్ తో పాటు ఇతర బీర్ లను కూడా ఈ కంపెనీ విక్రయిస్తుంది. మెండోసిస్ కు మాల్యానే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ బి ఎస్ తీసుకున్న నిర్ణయంతో విజయ్ మాల్యా గ్రూప్ కంపెనీలకు ఇబ్బందులు తప్పేట్లుగా లేవు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -