డయాబెటిస్ లేదా మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. మహమ్మారిలా విస్తరిస్తోన్న ఈ డయాబెటిస్‌పై అవగాహన లేకపోవడంతో రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది.అయితే జీవనశైలిలో కొన్ని మార్పులను చేయడం ద్వారా డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు. ఆహారంలో మార్పులు, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుంటే డయాబెటిస్ మీ దరిచేరదు.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్, షుగర్ కంటెంట్ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకూడదు. ఇక డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలంటే శారీరక శ్రమ అవసరం.
రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువు కూడా మధుమేహం బారిన పడేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి. దీర్ఘకాలిక ఒత్తిడి మధుమేహం ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా దోహదం చేస్తోంది. కాబట్టి ఒత్తిడిని దాదాపు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక రెగ్యులర్ మెడికల్ చెకప్ ద్వారా డయాబెటిస్‌ను అదుపులోకి తేవచ్చు.