Sunday, April 28, 2024
- Advertisement -

ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే

- Advertisement -

దీర్ఘ‌కాలిక వ్యాధులు వెంట‌నే రియాక్ష‌న్ ను చూపించ‌వు. అవి ముంద‌స్తుగా కొన్ని ల‌క్ష‌ణాల‌ను చూపిస్తాయి. దాంతో మ‌నం జాగ్ర‌త్త ప‌డితే మ‌న‌కు ఎంతో మంచి జ‌రుగుతుంది. ఏం కాదులే అనుకుంటే ఆ స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని తీవ్రంగా బాదిస్తాయి. అయితే డ‌యాబెటిస్ విష‌యంలో కూడా ఇలాగే జ‌రుగుతుంది వైద్య‌లు చెబుతున్నారు.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య డయాబెటిస్ (షుగర్ వ్యాధి). ఈవ్యాధిని మొదట్లోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు. కొంత మందిలో షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడం కష్టం. షుగర్ వ్యాధికి మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిలను అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. అంటే శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే.

Also Read: భోజనం మధ్యలో నీరు తాగడం మంచిదా..? కాదా..?

డయాబెటిస్ విషయంలో చర్మానికి సంబంధించి గుర్తులు క‌నిపిస్తాయ‌ట‌. అవేంటో ఇప్పుడు చూద్దాం.. డయాబెటిస్ రోగానికి చర్మానికీ సంబంధం ఉంటుందని ప‌లువురు చెబుతున్నారు. మీకు డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవ‌డానికి మాత్రం మీరు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల్సిందే. ఊరికే వెళ్లి టెస్టులు చేయించుకోకున్నా కానీ.. కొన్ని ర‌కాల చ‌ర్మ మార్పులు వ‌స్తే మాత్రం డాక్ట‌ర్ ను వెంట‌నే సంప్ర‌దించాలని ప‌లువురు చెబుతున్నారు. అలా పోతే.. షుగ‌ర్ రాకుండ ముందే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చిన ప‌లువురు చెబుతున్నారు.

మీ చ‌ర్మం ఊరికే పొడిబారుతోందా?, అలాగే తరచూ చర్మ సమస్యలతో ఇబ్బంధి ప‌డుతున్నారా? మీ చర్మం మొద్దుబారడం లాంటి స‌మ‌స్య‌లు చ‌వి చూస్తున్నారా.? అలాగే దురద, బొబ్బలు లాంటివి రావడం రొటీన్‌గా జ‌రుగుతుందా ? ఇలాంటి సూచిక‌లు క‌నిపిస్తే.. మీరు వెంట‌నే డాక్ట‌ర్ ను సంప్ర‌దించ‌డం ఎంతో మేలు. ఇవి డ‌యాబెటిస్ ల‌క్ష‌ణాల‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. మీకు క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. డాక్ట‌ర్ ను సంప్ర‌దించండి.

Also Read: రక్తదానం చేయడం వలన ప్రయోజనాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -