Friday, March 29, 2024
- Advertisement -

వరుసగా అన్ని దేశాలలో లాక్ డౌన్..!

- Advertisement -

లండన్​లో విధించిన లాక్​డౌన్ సుదీర్ఘకాలం కొనసాగవచ్చని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి మాట్​ హాన్​కాక్​ అభిప్రాయపడ్డారు.కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని లండన్​ సహా బ్రిటన్​లోని పలు ప్రాంతాల్లో దశల వారీగా ప్రభుత్వం లాక్​డౌన్ విధిస్తోంది.​ కొత్తరకం కరోనా వ్యాప్తి కూడా ఆంక్షలను పటిష్ఠం చేసేందుకు కారణమైంది. హాన్​కాక్ ఆదివారం నాడు​ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆంక్షల సడలింపులు ఇప్పట్లో కష్టమేనని హాన్​కాక్ అభిప్రాయపడ్డారు. నాలుగో విడత లాక్​డౌన్ విధించిన కొన్ని గంటలకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబరు 19న లండన్ సహా ఇంగ్లాండ్ తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో రెండు వారాల లాక్​డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్​ జాన్సన్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 30న పరిస్థితి సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -