Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ : అభిజిత్‌ గెలుపుకు కారణం ఇదే

- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 షోకు శుభం కార్డు పడింది స్టార్‌ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది. అంగరంగ వైభవంగా గ్రాండ్‌ ఫినాలే వేడుకలో సినీ తారలు అదిరిపోయే ప్రదర్శనతో అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ రియాలిటీ షో విజేతగా యువ హీరో, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రం ఫేమ్‌ అభిజిత్‌ నిలిచాడు. 19 మంది పాల్గొన్న ఈ షోలో చివరకు ఐదుగురు ఫైనల్‌ చేరారు. అయితే ఈ ఐదుగురు బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీకి తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరు గెలుపు మాత్రం మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ను వరించింది. అభిజిత్‌ ఎలా విజయం సాధించాడు. బిగ్‌బాస్‌ గేమ్‌లో ఆయన చూపిన ప్రతిభ ఏంటో ఓ లుక్కేద్దాం

కండ బలంతో కాకుండా బుద్ది బలంతో ఆడాడు
ఎమిదేళ్ల క్రితం వచ్చి లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ హీరో అభిజిత్‌ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పడు కూడా అభిజిత్‌పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. షో హైపు కోసం, అమ్మాయిలతో ట్రాకులు నడపడం కోసమే అభిని ఎంచుకున్నారని అనుకున్నారు. కానీ క్రమ క్రమంగా అభిజిత్‌ టాలెంట్‌ బయటపడింది. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్‌ ఆడడం ప్రేక్షకులను ఆకర్షించింది. మాస్టర్ మైండ్‌తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాస్క్‌ వచ్చిందంటే చాలు అందులో ఈజీగా ఎలా గెలవచ్చు అనేదానిపై అభి ఫోకస్‌ ఉండేది.

మిస్టర్‌ కూల్‌గా పేరు
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అతి తక్కువ గొడవలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఒక అభిజితే అని చెప్పొచ్చు. ఒక్క నామినేషన్‌ టాస్కుల్లో తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవపడలేదు. కామ్‌గా ఉంటూ.. నామినేషన్‌ను కూడా సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఓట్లను సంపాదించాడు. అలాగే లవ్‌ ట్రాకులకు ఆయన దూరంగా ఉన్నాడు. మోనాల్‌ విషయంలోనూ అభి నిర్ణయం అందరిని అబ్బురపరిచింది. ఇక అఖిల్‌, మోనాల్‌ ప్రవర్తన కూడా అభికి కలిసొచ్చింది.

ప్రతి వారం నామినేషన్‌లో ఉండడం
నాల్గో సీజన్‌లో నామినేషన్‌ అంటే భయపడని ఏకైక వ్యక్తి అబిజిత్‌ అనే చెప్పొచ్చు. చిన్న చిన్న కారణాలు చెప్పి నామినేట్‌ చేసినా కూడా కామ్‌గా ఉండేవాడు. మిగతా వాళ్లలాగా గొడవకు దిగకుండా.. నామినేషన్లను స్వాగతించేవాడు. అభిజీత్‌ను హౌస్‌మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది.

ఒక్క టాస్క్‌.. అభి జీవితాన్నే మార్చింది
సీజన్‌ మొత్తంలో అతి తక్కువగా టాస్క్‌లు ఆడింది మాత్రం అభిజిత్‌. ఇందులో సందేహం లేదు. మిగతావాళ్లు వందశాతం ఎఫర్ట్స్‌ పెట్టి ఆడినా.. అభి మాత్రం ఫిజికల్‌ టాస్కులు మాత్రం అంతగా ఆడేవాడు కాదు. కానీ ఒకే ఒక టాస్క్‌ అభికి మంచి పేరు తెచ్చి విజయానికి కారణమైంది. అదే రోబో టాస్క్‌. బిగ్ బాస్ ఇచ్చిన రోబో టాస్క్‌లో అతడు దివిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనం అయింది. అప్పుడు సోహెల్, మెహబూబ్, అఖిల్, మోనాల్‌లు అతడిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో కొట్టేందుకు మీదకెళ్లారు. అప్పుడే అభి పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది.

వీటితో పాటు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన నోయల్‌, లాస్యల మద్దతు,సినీ ప్రముఖుల సపోర్టు కూడా అభికి కలిసొచ్చింది. స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, శ్రీకాంత్ సహా ఎంతో మంది అతడికి సపోర్ట్ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా అతన్ని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చారు. వీరందరి మద్దతుతో పాటు అభి ప్రవర్తనే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అవ్వడానికి ఉపయోగపడింది.

ట్యూన్‌ కాపీ చేసిన తమన్‌.. ‘కింగ్‌’ సీన్‌తో నెటిజన్లు ట్రోలింగ్‌

బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి.. రెమ్యు​​​నరేషన్‌ ఎంతో తెలుసా?

అల్లు అరవింద్‌ 1000 కోట్ల సినిమా.. రంగంలోకి త్రివ్రికమ్‌!

బిగ్‌బాస్‌ షోపై పునర్నవి షాకింగ్‌ కామెంట్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -