Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ : సోహైల్‌కు చిరంజీవి భార్య ఊహించని గిఫ్ట్‌

- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌-4 శుభం కార్డు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు గ్రాండ్‌ ముగింపు ఇచ్చారు. తనదైన శైలీలో పంచ్‌లు, ప్రాసలతో ఫినాలేను గ్రాండ్‌ సక్సెస్‌ చేశాడు. అంతో కాదు కంటెస్టెంట్లు అందరి గురించి చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. ముఖ్యంగా సెకండ్‌ రన్నరఫ్‌గా నిలిచిన సోహైల్‌ గురించి మాట్లాడుతూ.. సింగరేణి ముద్దు బిడ్డా అంటూ ఉర్రూతలూగించారు. మన కథ, ఖార్కానాలు వేరే ఉంటాయి అంటూ సోహైల్‌ని ఇమినేట్‌ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఆ మేనరిజం తన రాబోయే సినిమాలో పెడతా.. దానికి పర్మిషన్ కావాలని సోహైల్‌ని అడగడంలో..సింగరేణి ముద్దుబిడ్డ ఎగిరి గంతేశాడు.

ఇక సోహైల్‌ అంటే తన ఇంట్లో వాళ్లకి కూడా బాగా ఇష్టమని,తరచూ అతడి గురించే మాట్లాడుకుంటారని వెల్లడించారు.సోహెల్ ఫినాలేకు చేరినందుకు సంతోషించామని చెప్పారు. ఇక తన భార్య సురేఖ సోహైల్‌ కోసం గిఫ్ట్‌ పంపిందంటూ వీడియో చూపించాడు చిరంజీవి. దాంట్లోచిరంజీవి భార్య సురేఖ.. సోహైల్‌ కోసం మటన్ బిర్యానీ చేసి పంపించారు. దీన్ని మెగాస్టారే స్వయంగా అతడి కోసం తీసుకొచ్చారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో మటన్‌ కోసం సోహైల్‌, మెహబూబ్‌ పడిన పాట్లు చూసి సురేఖ చలించిపోయిందని, అందుకే మీ అందరి కోసం బిర్యానీ చేసి పంపిందని చిరంజీవి వెల్లడించాడు. దీంతో ఆనందం పట్టలేకపోయిన సోహెల్.. గట్టిగా అరుస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆ తర్వాత సోహైల్‌ మాట్లాడుతూ..‘నాకు ఒక పేరు తీసుకుని వచ్చింది బిగ్ బాస్.. కానీ నాగార్జున సార్.. చిరంజీవి సార్ మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి.. బయటకు వెళ్లిన తరువాత నేను తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తా.. నాకు సపోర్ట్ చేయండి సార్ అని కోరాడు సొహైల్. నీకు ఏ రకంగా సపోర్ట్ చేయమంటావ్ చెప్పు అని చిరంజీవి అడిగారు.. ‘ఈ బిగ్ బాస్ నాకు కోట్ల మంది అభిమానుల్ని ఇచ్చింది. నేను సినిమా చేస్తే వాళ్లంతా చూస్తారనే నమ్మకం ఏర్పడింది. నేను తీసే సినిమా ఆడియో ఫంక్షన్ కానీ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఏదైనా చేస్తా తప్పుకుండా మీరు రావాలి సార్ అని చిరంజీవి అడగడాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసు చేసుకుని నా చేతుల మీదుగా చేస్తా.. అంతేకాదు.. వీలైతే నీ సినిమాలో నాకు చిన్న గెస్ట్ రోల్ ఇవ్వు చేస్తా అని హామీ ఇచ్చారు. దీంతో సోహైల్‌ మరోసార ఆనందంతో గట్టిగా అరుస్తూ ఎమోషనల్‌ అయ్యాడు.

అభిజిత్‌ గెలుపుకు కారణం ఇదే

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

ఎన్టీఆర్ భిన్నమైన వేషాలు.. హిట్ అయిన ఐదు సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -