సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. దౌలికర్క అడవుల్లో ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ చేశారు. కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయిన మావోల్లో ఒకరు…ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత ఏకైక బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని కాల్చి చంపిన మావోయిస్టు కమాండర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఎన్ కౌంటర్ లో బలగాలు సురక్షితంగా బయటపడ్డాయి. పరారైన మావోలను ఏరివేసేందుకు ఉన్నతాధికారులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు.
- Advertisement -
నెత్తురోడిన ఛత్తీస్ గఢ్….
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -