డీజీపీని కలిసిన బీజేపీ నేతలు

- Advertisement -

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో బడా నేతల పిల్లలు ఉండటం వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

బీజేపీ నేతలు రాంచందర్‌రావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, బంగారు శ్రుతి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. బాలిక అత్యాచార ఘటన అనేక మలుపులు తిరుగుతోందనీ.. అందుకే దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్‌లో పబ్‌ కల్చర్‌తో పాటు రేప్‌ కల్చర్‌ కూడా వచ్చిందని మండిపడ్డారు. వాటిని అరికట్టి సురక్షిత హైదరాబాద్‌ తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

Also Read

ఉద్యోగులపై సజ్జల కామెంట్స్

పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -