- Advertisement -

ఆ రోజు అక్క‌డేవ‌రు ప్యాంట్‌లు వేసుకోరు

- Advertisement -

పుర్రెకో బుద్ది అంటారు.. లండ‌న్‌, బెర్లిన్‌లో ఉన్న కొంద‌రు నోట్రౌజ‌ర్ ఈవెంట్ పేరుతో అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించేవారంతా.. ఫ్యాంట్‌లు, స్కర్టులు విప్పి రావాలంటూ ఓ సంస్థ పిలుపివ్వడంతో అంతా అదేబాట పట్టారు. షర్టు, అండర్‌వేర్ మాత్రమే ధరించి మెట్రోలో ప్రయాణించారు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. వందలాది మంది ప్రయాణికులు ఫ్యాంటులు లేకుండా మెట్రోలో ప్రయాణించడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.

ఇది మొద‌టి సారికాదు.. ‘నో ట్రౌజర్’ ఈవెంట్‌లో భాగంగా లండన్, బెర్లిన్ తదితర నగరాల్లోని ప్రజలు ఇలా ఫ్యాంట్లు విప్పి తిరగడం ఆనవాయితీగా మారింది. మొద‌ట‌ అమెరికాలోని న్యూయార్క్‌లో 2002 సంవత్సరంలో ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ పేరుతో మొదలైంది. అండర్ గ్రౌండ్ మెట్రో లలో ప్రయాణించేవారు ఒక రోజంతా ఫ్యాంట్లు ధరించకూడదు. ఇది దావనంలా వ్యాపించి ప్రపంచంవ్యాప్తంగా 60 నగరాలను తాకింది. లండన్‌లో ఈ కార్యక్రమాన్ని ‘స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ’ నిర్వహించింది. దీని వెనుక ఏ సంఘ సంస్క‌ర‌ణ ప‌నులు లేవు.. జ‌స్ట్ ఓ రోజంతా ఫన్నీగా గడపాలనేదే దీని వెనుక ఉన్న థీమ్‌.

https://twitter.com/AdForumCo/status/1084754332237680641

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -