Monday, May 5, 2025
- Advertisement -

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో నలుగురి సజీవదహనం

- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన నివాసంలో కోడలు, మనవళ్లు సజీవ దహనమయ్యారు. 

మృతుల్లో సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ లు గా గుర్తించారు. సమాచారం అందుకున్న కమిషనర్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు సిరిసిల్ల రాజయ్య నివాసానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదు. మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని వినిపిస్తున్నా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

గతంలో కోడలు సారిక..రాజయ్య కుటుంబంపై వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన విషయాలపై పోలీసులు ఎలాంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -