Thursday, April 25, 2024
- Advertisement -

కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

- Advertisement -

వివాదాస్పద నటి పూనమ్ కౌర్ తెలుగు ఇండస్ట్రీకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన “మాయాజాలం” సినిమాతో పరిచయమైన మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తర్వాత వచ్చిన సినిమాలు ఈ బ్యూటీకి పెద్ద కలిసి రాలేదనే చెప్పాలి.దీంతో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తోంది. తెలుగుతో పాటు కన్నడ,తమిళ సినిమాల్లో కూడా నటించింది.పూనం కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తుంది.

ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో అర్థం కాని ట్వీట్లతో అందర్నీ అయోమయానికి గురిచేసి ఆకర్షిస్తోంది. ఈమె స్పందించే ప్రతి అంశంపై వివాదాలు చెలరేగుతుంటాయి.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు, విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు.తాజాగా కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై పూనమ్ కౌర్ పరోక్షంగా స్పందిస్తూ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ అర్జీవి లాజిక్స్..?

పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావు, వదిలేశావు ఏళ్ల నుంచి పద్దతిగా నాపని మాత్రమే చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని కోరుకుంటున్నాను నువ్వు ప్రాణాలతో బయటపడాలని ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావని, ఇప్పటికైనా అమ్మాయిలను,అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్.. అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై చాలామంది తమదైన శైలిలో స్పందిస్తూ వివాదాస్పద చర్చలకు దారి తీస్తోంది.

Also read:కియారా అద్వానీపై టాలీవుడ్ హీరోల ఫోకస్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -