Saturday, April 20, 2024
- Advertisement -

ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

- Advertisement -

గీతిక అంటే బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఆట గీతిక అంటే అందరు టక్కువని గుర్తుపట్టేస్తారు. ఆట గీత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అతి చిన్న వయసులోనే బుజ్జి బుజ్జి మాటలతో సుందరం మాస్టర్ అంటూ ఎంతో క్యూట్ గా మాట్లాడిన చిచ్చరపిడుగు అప్పట్లో ఏ స్థాయిలో డాన్స్ దుమ్ము లేపిందో మనకు తెలిసిందే. అదేవిధంగా ఆట టైటిల్ రావడంతో ఈమె మరింత పాపులర్ అయింది.

ఈ విధంగా చిన్న వయసులోనే ఎంతో పాపులర్ అయిన ఆట గీతిక ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయ్యో పాపం గీతిక పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు,గీతిక పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆట గీతిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పరిస్థితుల గురించి వివరించింది.

Also read:రూమర్లకు ఒక్క ప్రోమోతో చెక్ పెట్టిన.. ఎవరు మీలో కోటీశ్వరుడు?

2012వ సంవత్సరంలో తన తండ్రితో పాటు కలిసి ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తున్న సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో తన కాలు చేయి పూర్తిగా విరిగిపోయాయి. అదేవిధంగా తన తండ్రికి కూడా గాయాలు కావడంతో కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ సినిమా సీరియల్ లో అవకాశాలు రావడంతో వాటిలో నటించాను. అయితే అవి అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లిపోవడంతో తను అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటూ చదువును కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న తను త్వరలోనే తన కెరియర్ పై దృష్టి పెడతానని, ఇదివరకు నా గురించి వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం అని ఈ సందర్భంగా గీతిక తెలిపారు.

Also read:బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -