Monday, April 29, 2024
- Advertisement -

ఇక ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు _ మోదీ సర్కార్ నిర్ణయం

- Advertisement -

దేశంలో నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఓ అపురూపమైన కానుక ఇవ్వనుంది. అదే ఉచిత గ్యాస్ పంపిణీ. ఉజ్వల యోజన పేరుతో ఈ ఫథకాన్ని మే 1 నుంచి ప్రారంభించనున్నారు. దేశంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారందరికి ఇక నుంచి ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఏడాదికి ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దేశంలో ఈ పథకం ద్వారా ఐదు వేల కుటుంబాలు లబ్ది పొందుతాయని భావిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీని దేశ వ్యాప్తంగా 1.13 కోట్ల మంది స్వచ్చంధంగా వదులుకున్నారు.

దీంతో ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలింది. ఇలా రావడం వల్లే నిరుపేదలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ పై ఇచ్చే సబ్సిడీని వదులుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 16.44 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -