మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. విపక్ష అభ్యర్థికి పట్టం కట్టి భారత్‌కు వ్యతిరేకిగా మారిన ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు మాల్దీవులు ప్రజలు షాక్ ఇచ్చారు .
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇబ్రహీం సోలీహ్ 58.3 శాతం ఓట్లు సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మొత్తం 2,62,000 మంది ఓటర్లలో 90 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహ్మద్ ఆ దేశ విపక్షనేతగా గుర్తుంపు పొందారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజలు అందించిన ప్రజాస్వామ్య విజయం అని అన్నారు.పోలైన వాటిలో 1,34,616 ఓట్లు ఇబ్రహీం దక్కించుకున్నారని తెలిపింది. ఇబ్రహీం విజయాన్ని భారత్, శ్రీలంకలు స్వాగతించాయి. ఇబ్రహీం విజయంతో మొత్తం 1,200 దీవుల్లో ప్రజలు ఆయన వర్గీయులు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
కొన్నిరోజుల క్రితం సంక్షోభం తలెత్తడంతో అబ్దుల్లా యమీన్ మాల్దీవుల్లో ఎమర్జెన్సీని విధించారు. పలువురు రాజకీయ నేతలు, అధికారులతో పాటు న్యాయమూర్తులను కూడా చేయించారు. యమీన్ దెబ్బకు మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. భారత్‌కు తలనొప్పిగా మారిన పాక్, చైనాలకు దగ్గరవుతూ..ఇండియాను దూరం పెట్టారు.
అందులో భాగంగా గతంలో భారత్ తమకు అందించిన సైనిక సహాయాన్ని వెనక్కు తీసుకోవాలని యమీన్ ప్రభుత్వం కోరింది. అంతేకాదు, భారతీయులకు కూడా వీసాలు మంజూరుచేయరాదని ఆదేశించింది. పాకిస్థాన్‌కు సైతం సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఇబ్రహీం మహ్మద్ సోలీహ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.