- Advertisement -

మరీ ఇంత పేద సిఎమ్మా…

- Advertisement -

పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఆస్తులు కేవలం 30 లక్షల రూపాయలేనట. తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన దీదీ దానితో పాటు ఆస్తుల అఫిడివిట్ కూడా జత చేశారు. తనకు సొంత స్ధలం కాని, వాహనాలు కాని లేవని, 2.15 లక్షల రూపాయలు విలువ చేసే మల్టీ జిమ్ మాత్రం ఉందని దీదీ పేర్కొన్నారు.

తన దగ్గర 18,436 రూపాయలు, బ్యాంక్ లో 27.6 లక్షల రూపాయలు ఉన్నాయని ఆమె అఫిడివిట్ లో పేర్కొన్నారు. 2014 _ 2015 ఆర్ధిక సంవత్సరంలో తన ఆదాయం5.96 లక్షల రూపాయలుండగా27 వేల రూపాయలు విలువ చేసే 9.75 గ్రాముల బంగారం ఉందని ఆమె తెలిపారు. మొత్తానికి దీదీ ఆస్తుల విలువ 30 లక్షల రూపాయలే కావడం గమనార్హం. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న మమతాబెనర్జీపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు దీపా దాస్ మున్షి, బిజెపి అభ్యర్ధి, నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ పోటీ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -