Saturday, May 18, 2024
- Advertisement -

నటుడు విజయ్ కాంత్ రహస్య క్రతువు

- Advertisement -

తమిళనాడులో ఎన్నికల హడావుడి రోజురోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకుందుకు కష్టపడుతూంటే నటుడు విజయ్ కాంత్ మాత్రం దేవుడా నువ్వే దిక్కు అంటున్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తన ఇంట్లో రహస్యం యాగం చేశారు.

తంజావూరు, కేరళ నుంచి వచ్చిన వేదపండితులు ఈ క్రతువు నిర్వహించారు. ఈ యాగంలో విజయ్ కాంత్ తో పాటు ఆయన భార్య ప్రేమలత కూడా పాల్గొన్నారు. విజయ్ కాంత్ తొమ్మిదిన్నరేళ్లు మాత్రమే ప్రభుత్వ పదవిలో ఉండే యోగం ఉందని గతంలో కొందరు జోస్యం చెప్పారు. డిఎంకె, బిజెపిలతో పొత్తు వదులుకుని ప్రజా సంక్షేమ కూటమితో చేతులు కలిపిన విజయ్ కాంత్ యాగం ఫలిస్తుందో లేదో చూడాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -