- Advertisement -

తాడిపత్రి టీడీపీలో వర్గ విబేధాలు

- Advertisement -

తాడిపత్రి టీడీపీ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కాకర్ల రంగనాథ్ వర్గానికి జేసీ హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాదు కమ్మ సంఘం నేత కాకర్ల రంగనాథ్, ఆయన సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేసీ ప్రకటించారు.

సస్పెండ్ చేసే అధికారం జేసీ ప్రభాకర్ రెడ్డి కి లేదని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -