రోరోజుకీ కొత్తీ టెక్నాజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈటెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్త రూపురేకలే మారిపోయాయి. ప్రధానంగా ఏటీఎం కార్డులు వ్యవస్తలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరి అందుబాటులోకి వచ్చాయి. ఇక చెల్లింపులన్నీ ఆన్ లైన్ ద్వారా ఈజీగా జరిగిపోతున్నాయి. నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్నయం తర్వాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల దిశగా తీసుకెల్లాలనీ మోదీ సూచించారు. దానికి అనుగునంగానే రిజర్వబ్యాంక్ చర్యలు చేపడుతోంది.
నోట్ల రద్దుతర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఎంత టెక్నాలజీ పెరిగిపోతుందో అంతే ఎక్కు వగా మోసాలు జరుగుతున్నాయి. ఎటీఎం కార్డుల ఆన్ లైన్ మోసాలు చెప్పనవసరం లేదు. కార్డు పిన్ నెంబర్ తెలిస్తే చాలు మన ప్రమేయంలేకుండా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమవుతాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సౌబర్ మోసాలు ఆగడంలేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ వాల్లు వేలిముద్రలతో కూడిన బయేమెట్రిక్ ఏటీఎం కార్డులను తీసుకొస్తున్నారు.
ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవనేది అందరికీ తెలిసిందే. అందుకే వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తే ఎటువంటి అక్రమాలకు తావుండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం పిన్ నంబర్‌తో లావాదేవీలు నిర్వహించే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. పిన్ ఎవరికైనా తెలిస్తే ఇక అంతే సంగతి. ఇటువంటి సమస్యలకు వేలిముద్రలే పరిష్కారమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే వేలిముద్రలతో పనిచేసే బయోమెట్రిక్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికాకు చెందిన మాస్టర్ కార్డు ఒప్రకటనలో తెలిపింది.
ఈ బయోమెట్రిక్ కార్డులో ఉండే చిప్‌లో వేలిముద్రల డేటాని పొందుపరుస్తారు. ఎక్కడైనా కొనుగోలు జరిపినప్పుడు ఆ కార్డుని స్వైప్ చేసి పిన్‌కి బదులుగా మన వేలిముద్ర వేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చని మాస్టర్ కార్డ్ కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా లావాదేవీలన్నీ సురక్షితంగా జరుగుతాయి. ఏటీఎం కార్డు పోయినా సరే ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే పిన్ నెంబర్ అవసరంలేదుకాబట్టి ఎవ్వరూ మన కార్డు ద్వరా డబ్బులను ట్రాన్స్‌పర్ చేసుకోలేరు. అంతేకాకుండా వీటికి డూప్లీకేట్‌ను తయారు చేయడం అసాధ్యం. ఈవిధానాన్ని ఇప్పటికే దక్షణాప్రికాలో పరీక్షించి చూడటంతోపాటు…. వినియేగదారులకూడా వీటిమీద సంతృప్తిని వ్యక్తం చేశారు.
బ్యాంకు నిర్వాహకులు వేలిముద్రల డాటాను కార్డులో పొందుపర్చి, కార్డును జారీ చేస్తారు. అంతేకాక బ్యాంకులు డిజిటల్ టెంప్లెట్‌ని తయారు చేస్తాయి. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ కార్డులు చిప్‌లు కలిగి ఉన్న కార్డుల్లానే పనిచేస్తాయి.కార్డుల్లో మరిన్ని సదుపాయాలు పొందుపరిచి త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి తెస్తామని మాస్టర్‌కార్డుకంపెనీ తెలిపింది. ఇక ఏటీఎం వినియేగదారులు తమ కార్డుపోయిని ఇబ్బందులపడాల్సిన అవసరంలేదు. మన అకౌంట్లలో మన డబ్బు సురక్షితంగా ఉంటుంది.
Related