- Advertisement -
నేటి నుండి నగదు ఛార్జీల మోత మొగనుంది. ఇకపై ఏటీఏంల నుండి డబ్బు విత్ డ్రా చేస్తే ప్రజలపై భారం పడనుంది. ఇప్పటివరకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్, పిన్ ఛేంజ్ వంటి లావాదేవీలకు నెలవారీ పరిమితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిమితికి మించిన ప్రతి లావాదేవీకి ప్రస్తుతం రూ.21 వసూలు చేస్తున్నారు. దీనిని మే 1 నుంచి రూ.23కు పెంచారు.
అలాగే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లతో ప్రయాణికులు మే 1 నుంచి స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించరాదని భారతీయ రైల్వే ప్రకటించింది. వీరు జనరల్ బోగీల్లో ప్రయాణించవచ్చునని చెప్పింది. క్యాన్సిలేషన్ రిఫండ్ సమయాన్ని 2 రోజులకు తగ్గించింది.
ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ నేటి నుండి అమల్లోకి వచ్చింది. 11 రాష్ట్రాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒక రాష్ట్రానికి ఒకే ఆర్‌ఆర్‌బీగా విలీనమవుతాయి.