Monday, May 20, 2024
- Advertisement -

కొత్త‌ ల‌గ్జ‌రీ ఏసీ ట్రైన్స్

- Advertisement -
Double-decker AC train for overnight journey to be launched in July

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రైల్వేల‌లో స‌మూల మార్పుల‌కు  శ్రీకారం చుట్టారు. పైల్వే ప్ర‌యానీకుల సౌక‌ర్యానికి పెద్ద‌పీట వేసింది రైల్వే. మంత్రిగా సురేష్ ప్ర‌భు మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత సంస్క‌ర‌న‌ల‌కు పెద్ద‌పీట వేశారు. దీనిలో భాగంగానే ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ పెడుతున్న రైల్వేబ‌డ్జెట్‌ను తీసువేసి సాధార‌న బ‌డ్జెట్‌లోని దాన్ని క‌లిపేశారు.

 ప్ర‌యానీకుల సౌక‌ర్యాల‌పై దృష్టిపెట్టిన రైల్వే  ఇటీ వల కాలంలో డబుల్ డెక్కర్ ట్రైన్లను తెర మీదకు తీసుకొచ్చినా.. వాటి వల్ల అంత ప్రయోజనం లేకపోవటం.. ఆదరణ తక్కువగా ఉండటంతో వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కొన్నిరూట్లలో అరకొరగా నడుపుతున్నా.. వాటికి పెద్దగా ఆదరణ లేదు.

 అయితే ఇప్పుడు డబుల్ డెక్కర్ రైళ్లను సరికొత్తగా సిద్ధం చేస్తున్నారు. భారీ డిమాండ్ ఉండే రూట్లలో సరికొత్తగా రూపొందించిన ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్లను పట్టాల మీదకు ఎక్కించాలని భావిస్తున్నారు. జులై నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న ఈ ట్రైన్ బోగీల్లో విశేషాలకు కొదవ లేదని చెప్పాలి .రాత్రి సమయాల్లో ప్రయాణించేవారి కోసం సౌకర్యవంతమైన కుర్చీలు, ఆహార, ద్రవ పదార్థాలు సర్వ్‌ చేసే వెండింగ్‌ యంత్రాలు ఏర్పాటుచేయనున్నారు.. ఈ రైళ్లు రద్దీ ఎక్కువగా ఉండే దిల్లీ-లఖ్‌నవూ వంటి మార్గాల్లో మొద‌ట ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 

ఈరైల్ల‌లో  టికెట్‌ ధరలు థర్డ్‌ క్లాస్‌ ఏసీ టికెట్ల కంటే కాస్త తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా 120 సీట్లు కలిగిన ఈ రైళ్లలో ఎల్‌సీడీ స్క్రీన్లు, వైఫై స్పీకర్‌ సిస్టమ్‌లు కూడా పెట్టించనున్నారు. రాత్రి వేళల్లో ఈ రైళ్లు ప్రయాణించినా ఇందులో స్లీపర్‌ బెర్త్‌లు ఉండవు. వాటికి బదులు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఆనుకునే కుర్చీలు ఏర్పాటుచేయనున్నారు. అంతేకాకుండా రైలు లోపలి భాగంలో ఆధునిక టెక్నాలజీతో డిజైన్‌ చేయడంతో పాటు బయో టాయ్‌లెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సాధారణ రైళ్లలో ప్రయాణికుల కంటే 40శాతం ఎక్కువ మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంది.

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ బోగీల్లో లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అత్యాధునికంగా తయారు చేసిన ఈ ట్రైన్లలో రాత్రి వేళలో ప్రయాణం చేయటానికి కాస్త ఇబ్బందే తప్పించి.. మిగిలినదంతా బాగుంటుందని చెబుతున్నారు. కొత్త తరహా ట్రైన్లకు ఉదయ్ ట్రైన్లు మొదలని  రైల్వేశాఖ చెప్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఈనెల 28కి తీర్పును రిజ‌ర్వ్ చేసిన సీబీఐ కోర్టు
  2. చంద్ర‌బాబు అల్టిమేట్టం… అధిష్టానానిదే నిర్ణ‌య‌మ‌న్న అఖిల‌ప్రియ‌
  3. ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌
  4. సాక్షీ ఎఫెక్ట్.. టీడీపీకి చుక్కలు చూపించిన ఉమ్మడి హైకోర్టు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -